Venkatesh – Revanth Reddy : వెంకీమామతో రేవంత్ రెడ్డి.. CSK వర్సెస్ SRH మ్యాచ్‌లో సందడి.. ఫొటోలు, వీడియోలు వైరల్
నేడు హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుండటంతో వెంకటేష్ ఉప్పల్ స్టేడియంలో CSK వర్సెస్ SRH మ్యాచ్ కి వచ్చి సందడి చేసాడు.

Venkatesh and Revanth Reddy Enjoying in Uppal Stadium CSK Vs SRH IPL Matach
Venkatesh – Revanth Reddy : నేడు ఐపీఎల్(IPL) లో CSK వర్సెస్ SRH మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. దీంతో మన తెలుగు క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లారు. ఇక క్రికెట్ అంటే విక్టరీ వెంకటేష్ ముందుంటాడు అని అందరికి తెలిసిందే. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా వెంకటేష్ కి ఖాళీ ఉంటే దేశంలో ఏ స్టేడియంకి అయినా వెళ్లి చూస్తాడు.
నేడు హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుండటంతో వెంకటేష్ ఉప్పల్ స్టేడియంలో CSK వర్సెస్ SRH మ్యాచ్ కి వచ్చి సందడి చేసాడు. అయితే ఇదే మ్యాచ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, వెంకటేష్ ఒకే చోట కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నరు. వెంకటేష్ SRH కి సపోర్ట్ చేస్తూ వికెట్స్ పడినప్పుడు అరుస్తూ నిలబడి మరీ సందడి చేశారు. దీంతో వెంకటేష్, రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
#VictoryVenkatesh At #SRHvsCSK#IPL #IPL2024 #Venkatesh #VenkateshDaggubati #VictoryVenkateshDaggubati @VenkyMama pic.twitter.com/aqiLiQWizr
— VIJAY KALAPALA (@VictoryVijay91) April 5, 2024
Telangana CM #RevanthReddy and #Venkatesh at Uppal Stadium today for #SRHvsCSK #IPL match. pic.twitter.com/dGbRe2ykir
— Gulte (@GulteOfficial) April 5, 2024