Ugadi Special event : ‘ఫ్యామిలీ స్టార్’తో ఉగాది ఉమ్మడి కుటుంబం.. విజయ్‌నే మించిపోయిన డ్రామా జూనియర్ పిల్లలు..

తాజాగా ఫ్యామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం అనే కార్యక్రమం ప్రోమో కూడా రిలీజ్ చేసారు.

Ugadi Special event : ‘ఫ్యామిలీ స్టార్’తో ఉగాది ఉమ్మడి కుటుంబం.. విజయ్‌నే మించిపోయిన డ్రామా జూనియర్ పిల్లలు..

Vijay Deverakonda Mrunal Thakur Dil Raju Family Star Team Participated in Ugadi Ummadi Kutumbam Zee Telugu Event

Updated On : April 5, 2024 / 8:41 PM IST

Ugadi Special event : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి సందడి చేస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యూనిట్ పలు టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిల్ రాజు కలిసి జీ తెలుగులో ఉగాది సందర్భంగా చేసిన ఉగాది ఉమ్మడి కుటుంబం ఈవెంట్ కి హాజరయ్యారు.

తాజాగా ఫ్యామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం అనే కార్యక్రమం ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్, వితిక షేరు హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఈ ఈవెంట్లో సీనియర్ నటీనటులు రాశి, కస్తూరి, ఇషాచావ్లా, నాగినీడు, అలీ.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో బిత్తిరి సత్తి వేణుస్వామిలా మారి జాతకాలు చెప్పి నవ్వించాడు.

Also Read : Director Chidambaram : బన్నీ వల్లే మలయాళంలో తెలుగు సినిమాలు తెలుసు.. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో తీస్తే ఆ హీరోలందర్నీ పెట్టి..

విజయ్ ముందు జీ తెలుగు డ్రామా జూనియర్స్ పిల్లలు విజయ్ సినిమాల నుంచి కొన్ని సీన్స్ తో స్పూఫ్ స్కిట్ చేసి ఫుల్ గా నవ్వించారు. దీంతో విజయ్ కూడా వాళ్ళని మెచ్చుకొని వారితో డ్యాన్స్ వేసాడు. అనంతరం పలువురు జీ సీరియల్ నటీనటులు రెట్రో స్టైల్ లో పాత పాటలకు డ్యాన్సులు వేసి, పాత సీన్స్ కు నటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇక తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండగ నాడు జీ తెలుగు ఫ్యామిలీ స్టార్​తో ఉగాది ఉమ్మడి కుటుంబం ఈవెంట్ ఏప్రిల్​ 7 ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది.