Director Chidambaram : బన్నీ వల్లే మలయాళంలో తెలుగు సినిమాలు తెలుసు.. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో తీస్తే ఆ హీరోలందర్నీ పెట్టి..
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు.

Manjummel Boys Movie Director Chidambaram Interesting Comments on Allu Arjun and Telugu Cinema
Manjummel Boys Movie Director Chidambaram : మలయాళంలో ఇటీవల రిలీజయి మంజుమ్మల్ బాయ్స్ సినిమా భారీ హిట్ కొట్టింది. ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి మొదటి మలయాళీ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు. కొంతమంది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ ఓ ట్రిప్ కి వెళ్తే ఆ ట్రిప్ లో కొండ గుహల్లోకి వెళ్తే అక్కడ లోయలో పడిన ఓ ఫ్రెండ్ ని ఎన్ని కష్టాలు పడి బయటకు తీశారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇప్పుడు ఈ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులో కూడా రిలీజవుతుంది. రేపు ఏప్రిల్ 6న మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో రిలీజవుతుంది. ఈ సినిమాలో నటించిన పలువురు నటులు, దర్శకుడు చిదంబరం తెలుగులో కూడా ప్రమోషన్స్ కి వచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు.
ఈ ఇంటర్వ్యూలో మీకు నచ్చిన తెలుగు సినిమాలు, మీరు చూసిన తెలుగు సినిమాలు చెప్పండి అని అడగ్గా.. అంతకుముందు నాకు తెలీదు కానీ నా జనరేషన్ లో మాత్రం బన్నీ సినిమా నుంచే తెలుగు సినిమాలు తెలుసు. ఆ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) సర్ సినిమాలన్నీ అక్కడ రిలీజ్ అయి మంచి విజయాలు సాధించాయి. వాటి వల్లే మాకు తెలుగు సినిమాలు అలవాటు అయ్యాయి. రాజమౌళి, సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఇష్టం. అరుంధతి సినిమా కూడా ఇష్టం. పాత మాయాబజార్ సినిమా మాత్రం సినిమా వాళ్లందరికీ ఒక బుక్ లాంటింది అని తెలుగు సినిమాల గురించి పొగిడాడు.
Also Read : Sarangadhariya Song : ‘సారంగదరియా’ సినిమా నుంచి ఇన్‌స్పిరేషనల్ సాంగ్ విన్నారా? చిత్రమ్మ ఎంత బాగా పాడిందో..
ఇక ఈ ఇంటర్వ్యూలో ఇక్కడ తెలుగులో మంజుమ్మల్ బాయ్స్ సినిమా తీస్తే ఏ హీరోలని, ఎవర్ని తీసుకుంటారు బాయ్స్ గా అని అడిగారు. దీనికి దర్శకుడు చిదంబరం సమాధానమిస్తూ.. అస్సలు ఆలోచించలేదు. కానీ చాలా వరకు యువ హీరోలని తీసుకుంటాను. అల్లు అర్జున్, నాని, నవీన్ పోలిశెట్టి, రానా.. ఇలాంటి వాళ్ళని తీసుకుంటాను అని తెలిపాడు. దీంతో మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.