Sarangadhariya Song : ‘సారంగదరియా’ సినిమా నుంచి ఇన్‌స్పిరేషనల్ సాంగ్ విన్నారా? చిత్రమ్మ ఎంత బాగా పాడిందో..
తాజాగా సారంగదరియా సినిమా నుంచి 'అందుకోవా.. ఆకాశం అదిగో..' అని సాగే ఓ ఇన్‌స్పిరేషనల్ పాటని విడుదల చేశారు.

Andukova Lyrical Video Song Released by Raja Ravindra Movie Sarangadhariya Sing by KS Chithra
Sarangadhariya Song : ఇటీవల సీనియర్ నటీనటులు కూడా మెయిన్ లీడ్స్ గా మంచి కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు రాజా రవీంద్ర మెయిన్ లీడ్ లో ‘సారంగదరియా’ అనే సినిమా తెరకెక్కుతుంది. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో ఈ సారంగదరియా సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘అందుకోవా.. ఆకాశం అదిగో..’ అని సాగే ఓ ఇన్‌స్పిరేషనల్ పాటని విడుదల చేశారు. నవీన్ చంద్ర ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల ఈ పాటని రాయగా ఎం.ఎబెనెజర్ పాల్ సంగీత దర్శకత్వంలో చిత్ర గారు పాడారు. ఈ పాటని మీరు కూడా వినేయండి.
Also Read : Dil Raju : విజయ్, మృణాల్‌తో కలిసి అలాంటి ఫ్యామిలీస్ అందరి ఇళ్లకు వెళ్లి సర్‌ప్రైజ్ చేస్తాం..
ఇక ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణల కథగా ఉండనుందని, ఆల్రెడీ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.