Congress Leader Kaushik Reddy Will Soon Join The Trs Party
Congress Leader Kaushik Reddy : హుజూరాబాద్ రాజకీయాలు రంజురంజుగా సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో…హస్తం పార్టీ నేత కౌశిక్ రెడ్డి..గులాబీ పార్టీ అధినేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నుండి గతంలో కౌశిక్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే.
మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ రావులతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం కౌశిక్ రెడ్డి భేటీ కావడం రాజకీయాలు హీట్ ఎక్కాయి. ప్రగతి భవన్ సమీపంలో ఓ స్టార్ హోటల్ లో వీరు సమావేశమయ్యారు. పార్టీలో చేరిక, ఎమ్మెల్యే అభ్యర్థి విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈటల పార్టీ మారుతున్నారని తెలిసిన నాటి నుండే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈటలతో బీజేపీ నేతలు భేటీ కావటం.. ఆయన ఈ నెల 14న బీజేపీలో చేరటం ఖాయమైన నేపథ్యంలో కేటీఆర్, సంతోష్ లతో కౌశిక్ రెడ్డి భేటీ కావటం ప్రాముఖ్యం సంతరించుకుంది.
Read More : Punjab ‘Tree Man’: 10 వేల మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు..ప్రాణావాయువు అందక మృతి!