Komatireddy Venkat Reddy : వార్ వన్ సైడే .. మాలో ఎవరు సీఎం అయినా దానిపైనే తొలి సంతకం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆయా పార్టీల నుంచి పలు నియోజకవర్గాల్లో ఎంతోమంది నేతలు కాంగ్రెస్ లో చేరటంతో టీ.కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది.

Komatireddy Venkat Reddy

T.congress Komatireddy Venkat Reddy : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆయా పార్టీల నుంచి పలు నియోజకవర్గాల్లో ఎంతోమంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో టీ కాంగ్రెస్ లో రోజు రోజుకు జోష్ పెరుగుతోంది. హస్తం పార్టీ నేతలు వారి వారి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి ఎవరు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా చేర్చుకుంటున్నారు. దీంట్లో భాగంగా బుధవారం నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతు..తెలంగాణలో కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్లు వస్తాయని..గెలుపు అనివార్యమేనని అన్నారు.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమేనని ధీమా వ్యక్తంచేశారు. మా నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయిపోయిందన్నారు. మాలో సీఎం అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. మాలో సీఎం ఎవరు అయినా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం చేస్తామని వెల్లడించారు.

Komatireddy Venkat Reddy : నా సోదరుడు కాంగ్రెస్‌లో చేరుతున్నాడని నాకు తెలీదు, రాజగోపాలే కాదు చాలామంది చేరుతున్నారు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాగా..తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గతంలో కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. దీంట్లో భాగంగా రాజగోపాల్ బీజేపీకి రాజీనామా చేశారు. రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత మునుగోడుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేశారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత తెలంగాణ బీజేపీలోనే కొనసాగినా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా రాజకీయ సమీకణలు మారిపోతుండటంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. బీజేపీకి రాజీనామా చేసిన తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇది తెలంగాణ బీజేపీకి షాక్ కలిగించే విషయమే అయినా బీజేపీ పెద్దలు తన రాజీనామాను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.

Komati Reddy Rajagopal Reddy : బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షాకు రుణపడి ఉంటానని వెల్లడి

బీజేపీకి రాజీనామా అంశంపై రాజగోపాల్ మాట్లాడుతు..కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుని ఆ పార్టీ చేరడం జరిగిందని, కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారడంతో తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నానని తెలిపారు.