Mallu Ravi : అందుకే బీఆర్ఎస్,బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు : మల్లు రవి

లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు...ఆయన పార్టీ పెట్టిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు మల్లు రవి

Mallu Ravi

Mallu Ravi..Jaya Prakash Narayana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగా గాంధీ భవన్ లో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మెజార్టీ తో గెలిపించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని అన్నారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ పెద్ద నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజాస్వామ్య పరిపాలన వస్తుందని..సామజిక న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు.

ఇష్టానురీతిగా కేసులు పెట్టి ప్రజలను వేధిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందన్నారు.ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్ కి .. పెత్తందారి పాలన కావాలంటే బీఆరెస్ కి ఓటేయాలని రాహుల్ గాంధీ చెప్పారు అనే విషయాన్ని గుర్తు చేశారు.లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు…ఆయన పార్టీ పెట్టిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు మల్లు రవి.బీఆరెస్ ప్రభుత్వం పాలన మంచిది అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ సాధ్యంకాదని జయ ప్రకాష్ నారాయణ అంటున్నారు మరి..మరి బీఆరెస్ వి సాధ్యమవుతాయా..? అని ప్రశ్నించారు.

Komatireddy Venkat Reddy : వార్ వన్ సైడే .. మాలో ఎవరు సీఎం అయినా దానిపైనే తొలి సంతకం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ జయప్రకాశ్ నారాయణపై మండిపడ్డారు.నాగం జనార్దన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ఆ విషయాన్ని మా హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు.బీఆరెస్ ని ఎదుర్కునేది కాంగ్రెస్ కాబట్టే రాజ్ గోపాల్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.