Telangana Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం

దానం నాగేందర్‌ను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.

తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానం, కౌశిక్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. జాబ్‌ క్యాలెండర్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ పొడియం నుంచి ముట్టడించారు బీఆర్‌ఎస్‌ సభ్యులు. హైదరాబాద్‌ అభివృద్ధిపై స్పీకర్ చర్చను ప్రారంభించడం, దానం నాగేందర్‌కు మైక్‌ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

తోలు తీస్తా, బయట తిరగనివ్వబోమంటూ దానం నాగేందర్ బెదిరించారు. దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పోడియం వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యుల వైపునకు దానం దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయనను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు.

దానం నాగేందర్‌కు విప్‌ ఆదిశ్రీనివాస్‌, ఉత్తమ్‌ పద్మావతి సర్దిచెప్పారు. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చెలరేగి ఆ తర్వాత సద్దుమణిగింది. కాగా, అంతకు ముందు అసెంబ్లీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.

SR nagar boys hostel: హైదరాబాద్‌లోని హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం.. భారీగా మత్తుపదార్థాలు స్వాధీనం

ట్రెండింగ్ వార్తలు