Shabbir Ali
Shabbir Ali – KCR : కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో సీఎం ఒక దుబాయి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే ముందే తాను మంత్రిని అయ్యానని చెప్పారు. తక్కువ దూరంలో హెలిక్యాప్టర్ తిరగడానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఈ మేరకు శనివారం ఆయన కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 2004లో పొత్తు ఉన్నప్పటికీ తనపై టీఆర్ఎస్ పోటీ చేసిందన్నారు. కామారెడ్డి సభలో కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు. కేసీఆర్ ది డబుల్ గేమ్ అని విమర్శించారు.
Telangana Congress: అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?
కేసీఆర్ కుటుంబంలో అందరిపై కేసులున్నాయని పేర్కొన్నారు. తనపై ఒక్క పిటి కేసు కూడా లేదన్నారు. అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు పెద్ద సినిమా చూపిస్తారని హెచ్చరించారు.
కేసీఆర్ ను ఓడించి పంపిస్తామని శపథం చేశారు. 24 గంటలు కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు తీగలు పట్టుకునేందుకు తాము సిద్ధమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు.