CM KCR On Congress (Photo : Google)
CM KCR On Congress : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుసగా సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై ఫైర్ అవుతున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు.
ఆర్మూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఆర్మూరులో ఇది జనమా? సముద్రమా..? అంటూ ప్రసంగం మొదలుపెట్టారు కేసీఆర్. ”జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఎర్రజోన్న రైతుల కోసం ఆమరణ దీక్ష చేశారు. ఇక్కడే ఎర్రజొన్న ఉద్యమంలో రైతులపై కాంగ్రెస్ పార్టీ కాల్పులు జరిపింది. ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఎవరో ఒకరు గెలుస్తారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ టీపీ దూరం, కాంగ్రెస్ కు మద్దతు : వైఎస్ షర్మిల
నాకు ఆర్మూరులో అంకాపూర్ అంటే ప్రత్యేక ప్రేమ. అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం. ఎన్నికలు వచ్చాయని అన్ని పార్టీల నాయకులు వస్తారు. ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి. అభ్యర్థులనే కాదు, ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీని, ఆ పార్టీని నడిపించే నాయకుడిని కూడా చూడాలి. ఎమ్మెల్యేకు ఓటు వేస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ ప్రభుత్వంలో ఎవరుండాలో మీరే నిర్ణయించుకోవాలి.
రైతుబంధుపై ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని మోదీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. కానీ రైతుల కోసం దానిని ఒప్పుకోలేదు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24గంటల కరెంట్ ఇవ్వడం లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా నా మాట నమ్మండి. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తామని చెబుతున్నారు. అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవుతాయి.
Also Read : తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు.. నిలబడితే గెలవాలి : సీఎం కేసీఆర్
బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో పెన్షన్ లేదు. మన దగ్గరనే బీడీ కార్మికులకు పెన్షన్ ఉంది. పెన్షన్లు పెంచుతాం. కొత్త వారికి కూడా ఇస్తాం. బీడీ కార్మికులకు కాదు. టేకేదార్లు, ప్యాకింగ్ చేసేవారికి మంజూరు చేశాం.
అందరికీ సాయం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.