YS Sharmila : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ టీపీ దూరం, కాంగ్రెస్ కు మద్దతు : వైఎస్ షర్మిల

కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

YS Sharmila : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ టీపీ దూరం, కాంగ్రెస్ కు మద్దతు : వైఎస్ షర్మిల

YS Sharmila (8)

Updated On : November 3, 2023 / 1:14 PM IST

YS Sharmila YSRTP Party No Contest : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ టీపీ పార్టీ దూరంగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ టీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం లేదని తెలిపారు.

సంక్షేమం కోసం వైఎస్సార్ టీపీని స్థాపించామని వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పార్టీ పెట్టినప్పటి నుండి ప్రజలతో నమ్మకంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళ అని కూడా చూడకుండా జైల్లో పెట్టిందన్నారు. ప్రతి వర్గానికి మేలు చేయడానికి వైఎస్సార్ టీపీ చూసిందన్నారు.

Congress : ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి అధికారంలోకి కాంగ్రెస్‌.. పీపుల్స్‌ పల్స్‌ ప్రీ పోల్‌ సర్వేలో వెల్లడి

రూ.5లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్
తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు. 3,800 కిలోమీటర్లు పాద యాత్ర చేశామని తెలిపారు. ప్రతి అంశంపై కేసీఆర్ ను ప్రశ్నించామని, ప్రజల పక్షాన ఉన్నామని చెప్పారు. అక్రమాల గురించి మాట్లాడిన పార్టీ వైఎస్సార్ టీపీ అని అన్నారు. తమ పార్టీ కాళేశ్వరం స్కాం గురించి మాట్లాడిందని తెలిపారు. కేసీఆర్ రూ.5లక్షల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు.

తాము కేసీఆర్ స్కాం గురించి మొదట పోరాటం చేసిన తరువాత ప్రతి పక్షాలు స్టార్ట్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా ప్రజల కోసమేనని తెలిపారు. ఈ వ్యతిరేక ఓటు చీల్చవద్దని కాంగ్రెస్ నేతలు తమను కోరారని తెలిపారు. ‘కాంగ్రెస్ కి అవకాశం ఉన్న సమయంలో మీరు ఎలా పోటీ చేస్తారని అడిగారు.. రాజశేఖర్ బిడ్డగా పార్టీని ఒడిస్తావా అని నన్ను అడిగారు’ అని పేర్కొన్నారు.

Kasani Gnaneshwar : బీఆర్ఎస్ లో చేరనున్న కాసాని.. గోశామహల్ నుంచి పోటీ?

కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. దేశంలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు చిలిస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే చరిత్ర తనను క్షమించదన్నారు. అవినీతి పాలన అంతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్ ఆర్ టీపీ పోటీ చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు.

నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి
తాను తప్పు చేస్తే తనను క్షమించాలన్నారు. పాలేరు ప్రజలకు తాను సమాధానం ఇవ్వాలన్నారు. పాలేరు ప్రజలకు నిలబడతా అని మాట ఇచ్చానని తెలిపారు. 2013లో పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ ప్రతి రోజు తన పక్కన ఉన్నారని పేర్కొన్నారు. 700 మంది చనిపోతే అందులో 400 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారని తెలిపారు.

Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ప్రతి ఇంటికి తనతో పొంగులేటి వచ్చారని పేర్కొన్నారు. మొండిగా తనను పోటీ చేయమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? పాలేరు ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. గెలుపు గొప్పదే కానీ, త్యాగం ఇంకా గొప్పదన్నారు. ఈ సందర్భంగా షర్మిల భావోద్వేగానికి గురయ్యారు.