Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు అంక్షలు విధించనున్నారు.

Telangana Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Telangana Election Nominations (1)

Updated On : November 3, 2023 / 9:23 AM IST

Telangana Election Nominations : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో కీలక ఘట్టానికి తెరలేవనుంది. నేడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి నామినేషషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే సమయంలో ఆర్వో కార్యాలయాల వద్ద పోలీసులు అంక్షలు విధించనున్నారు. ఆర్వో కార్యాలయాల్లోకి అభ్యర్థులు సహా ఐదుగురు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు.

Kasani Gnaneshwar : బీఆర్ఎస్ లో చేరనున్న కాసాని.. గోశామహల్ నుంచి పోటీ?

అటు ఆర్వో కేంద్రాల వద్ద వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలకు అనుమతి ఇస్తారు. ఈసారి సువిధ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నామినేషన్ వేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఆన్ లైన్ నామినేషన్ వేస్తే దానికి సంబంధించిన ప్రింటెడ్ కాపీని ఆర్వోకు అందించాల్సివుంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ చివరి రోజు. నవంబర్ 30న ఓటింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయకూడదు. రిటర్నింగ్ కార్యాలయం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలతోపాటు వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.