Home » Telangana Election 2023
జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.
అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. యాకుత్ పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పార్టీల వారిగా ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి 39.40శాతం, బీఆర్ఎస్ పార్టీకి 37.35శాతం, బీజేపీకి 13.90శాతం, ఏఐఎంఐఎంకు 2.22శాతం, సీపీఐ పార్టీకి 0.34శాతం ఓట్లు పోలయ్యాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది.
ఫలితాలు రాకముందే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
తొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అవి పూర్తయిన తరువాత అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్ కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
హైదరాబాద్ లోఉన్న ఓటును ఫామ్ -8 ద్వారా తమ్మినేని తెల్దారుపల్లికి మార్చుకున్నారు. తెల్దారుపల్లికి ఓటు మారుస్తూ ఓటరు ఐడీని ఎన్నికల అధికారులు జారీ చేశారు.