Gidugu Rudra Raju : నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.

Gidugu Rudra Raju : నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి

Rajasthan Exit Polls 2023

Updated On : November 30, 2023 / 9:28 PM IST

Telangana Election 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉందని, ఎవరైనా అధికారంలోకి రావొచ్చని చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మేమే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తామని పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు ఏపీలోని పలువురు కాంగ్రెస్ నేతలుసైతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. 70పైగా స్థానాల్లో గెలిచి సుస్థిర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు పర్చలేదని రుద్రరాజు అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావితం చూపుతాయని అన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.