First Time Win : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 52 మంది గెలుపు

జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు.

First Time Win : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 52 మంది గెలుపు

First Time Mla

MLA First Time Win : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 52 మంది కొత్తగా గెలిచారు. రాష్ట్రంలోని 119 మంది అమ్మెల్యేల్లో కొత్తగా 52 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 34 మంది కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బీఆర్ఎస్ నుంచి 9 మంది ఉండగా వీరిలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

అదే విధంగా జనగామ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. మరోవైపు దుబ్బాకలో బీఆర్ఎస్ తరపున గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు. బీజేపీ నుంచి కొత్తగా ఆరుగురు అసెంబ్లీలో పెట్టనున్నారు. ఎంఐంఎం నుంచి కొత్తగా ముగ్గురు గెలిచారు. మొత్తం కలిపి 52 మంది కొత్తగా తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.

Small Majority : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన నేతలు వీరే

20 మంది 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నాయకులు భారీ మెజారిటీతో గెలించారు. 20 మందికి పైగా నాయకులు 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. కాగా, ముగ్గురు 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

బొటాబొటీ ఓట్లతో గట్టెక్కిన నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు భారీ మెజారిటీ సాధించగా మరికొంతమంది బొటాబొటీ ఓట్లతో గట్టెక్కారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. కాలే యాదయ్య, జాఫర్ హుస్సేన్, లక్ష్మీకాంతరావు, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, మాజిద్ హుస్సేన్, పి.సుదర్శన్ రెడ్డి, హరీష్ బాబు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎడ్మ బొజ్జు తక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.