Oruganti Venkatesham goud
Congress Leader Joined TRS : కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో నేత టీఆర్ఎస్ లో చేరాడు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కేసీఆర్‌తోనే సాధ్యమని విశ్వసిస్తున్నానని చెప్పారు.
kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బీసీ సామాజిక వర్గాల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.