Revanth Reddy
Congress: స్థానిక ఎన్నికలు పెట్టాలనుకున్నారు. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే రిజర్వేషన్ల పీటముడితో..బీసీ కోటా జీవో, ఎన్నికల నోటిఫికేషన్ రెండూ రద్దయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అయ్యింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్‌లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లు గ్రౌండ్‌లో పరిస్థితులు ఉలా ఉన్నాయన్న ఆందోళన ఉండేది.
యూరియా ఇవ్వలేదని రైతులు కోపంగా ఉన్నారన్న టాక్..రైతు భరోసా నిధులు జమ చేయడంలో ఆలస్యం..ఆరు గ్యారెంటీల అమలు కాకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. కానీ జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అదంతా సైడ్ అయిపోయినట్లేనని భావిస్తోందట అధికార కాంగ్రెస్. జూబ్లీహిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత..ఆ గెలుపు జోష్‌లో స్థానిక ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట సర్కార్.
ఇప్పటికే స్పష్టం చేసిన హైకోర్టు
అయితే రిజర్వేషన్లను 50శాతం మించకుండా చూడాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చూస్తే.. బీసీలకు 23 శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కుతాయి. అలా చేస్తే అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీలకు ఇచ్చిన హామీ 42శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలేవీ వర్కౌట్ కాలేదు. మరోవైపు స్థానిక ఎన్నికలను పెట్టాలని..గ్రామాల్లో పరిపాలన పడకేయడం సరికాదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలంటూ అల్టిమేటం జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో పాత పద్దతిని ఫాలో కావాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చిందట. పాత పద్దతిలో 50శాతానికి రిజర్వేషన్లు మించకుండా జీవో ఇచ్చి..మిగతా రిజర్వేషన్లను పార్టీపరంగా ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యిందట. పాత పద్దతిలో ఎన్నికల నిర్వహణ కోసం త్వరలో క్యాబినెట్ భేటీలో డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు. వాస్తవానికి 12వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని భావించారు.
కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రులు బిజీగా గడపడంతో..రెండు రోజులు ఆగి రిజల్ట్ వచ్చాక మంత్రివర్గ భేటీ ఉండబోతందట. జూబ్లీహిల్స్‌లో కచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉండటంతో..ఫలితాలు వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశం నిర్వహించి ..స్థానిక సమరంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట అధికార పార్టీ. అంతా అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నారట. ఈ సారైనా లోకల్ బాడీ పోల్స్ జరిగేనా..లేక మళ్లీ ఏమైనా చిక్కులు వచ్చిపడుతాయో వేచి చూడాలి మరి.