V Hanumantha Rao: ప్రధాని మోదీపై వీహెచ్ ఫైర్.. చిత్తశుద్ది ఉంటే అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలంటూ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం అతిగా వ్యవహరిస్తోంది. పోస్టర్లతో నింపేస్తుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ పోస్టర్లు ఎన్నైనా పెట్టుకుంటారు. కానీ, ఇతరులు పెడితే చింపేస్తున్నారు.

Congress Senior Leader V Hanumantha Rao

Congress Senior Leader V Hanumantha Rao: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఫైర్ అయ్యారు. మణిపూర్‌లో గిరిజనుల మధ్య ఘర్షణలతో అతలాకుతలం అవుతోంది. ప్రధాని అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ఉన్నది బీజేపీ సర్కారు. అందుకే ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు. బహిరంగంగా ఎన్నో అకృత్యాలు అక్కడ జరుగుతున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ అక్కడి పరిస్థితి చక్కదిద్దాలని వీహెచ్ అన్నారు. మహిళా బిల్లు తెచ్చా అంటున్నారు.. కానీ, మణిపూర్‌లో మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి రాజకీయాలే ఎక్కువయ్యాయి అంటూ వీహెచ్ విమర్శించారు.

Read Also : Himanshu Rao : తెలంగాణ పంట పొలాల్లో నాకు కనిపించే రూపం..అంటూ కేసీఆర్ మనవడి ట్వీట్ వైరల్

మోదీ పేరుకే బీసీ..
కాంగ్రెస్ బీసీ నేతలు వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నమాట నిజమేనని వీ హనుమంతరావు అన్నారు. మధు యాష్కీ సహా మా బీసీ నేతల్లో కొందరు ఖర్గేను కలిశారు. నేను నిన్న కేసీ వేణుగోపాల్‌ను కలిశాను. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని వీహెచ్ గుర్తుచేశారు. షాద్‌నగర్‌లో బీసీ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తున్నారని, ఈ సభలో బీసీ డిక్లరేషన్‌కూడా ఉంటుందని వీహెచ్ చెప్పారు. బీసీ జనాభా రాష్ట్రంలో, దేశంలో సగం కంటే ఎక్కువ ఉన్నాం. బీసీలకు న్యాయం జరుగుతుందన్న అశతో ఉన్నాం. ప్రధాని మోదీ పేరుకే బీసీ అంటారు తప్ప, ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదని వీహెచ్ ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మమ్మల్ని గ్రూపుగా రావొద్దని చెప్పారు. విడిగా కొందరికి కలిసే అవకాశం ఇచ్చారు. బీసీలకు కనీసం 34 సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉందని వీహెచ్ చెప్పారు.

Read Also : Kasireddy Narayana Reddy : బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ లోకి!

అన్నీ మీ పోస్టర్లేనా?
రాష్ట్ర ప్రభుత్వం అతిగా వ్యవహరిస్తోంది. పోస్టర్లతో నింపేస్తుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ పోస్టర్లు ఎన్నైనా పెట్టుకుంటారు. కానీ, ఇతరులు పెడితే చింపేస్తున్నారు. ఇది సరియైన పద్దతి కాదంటూ రాష్ట్ర ప్రభుత్వంతీరుపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.