Congress Vs BRS: మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల సవాల్ ను స్వీకరించిన మైనంపల్లి..

అయినప్పటికి కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ ఆఫీస్ లో తిష్ట వేశారు.

Congress Vs BRS: హైదరాబాద్ మల్కాజ్ గిరి పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అల్వాల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవ ఎఫెక్ట్ మల్కాజ్ గిరిని తాకింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే మల్కాజ్ గిరి రా అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్కాజ్ గిరి చౌరస్తాకు వెళ్లారు.

దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికి కాంగ్రెస్ నాయకులు మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తమ పార్టీ ఆఫీస్ లో తిష్ట వేశారు. దీంతో మల్కాజ్ గిరిలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.