Komatireddy Venkat Reddy (Image Credit To Original Source)
Women IAS Officers Issue: తెలంగాణలో ఒకటే చర్చ. నాలుగైదు రోజులుగా అదే రచ్చ. మంత్రులు, మహిళా ఐఏఎస్‌లపై వచ్చిన వార్తల చుట్టూ పెద్ద వివాదమే నడుస్తోంది. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ హోరెత్తుతుంటే..పలువురు ప్రతిపక్ష నేతలు తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్‌లు పెడుతూ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ప్రచారం కాస్త ఇంతింతై వటుడింతై అన్నట్లు పెద్దగా మారుతుండటంతో..అటు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల సంఘాలు రియాక్ట్ కావడమే కాదు.. ఏకంగా తనపై వచ్చిన వార్తలపై మంత్రి కోమటిరెడ్డి కూడా స్పందించారు. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లా కలెక్టర్ పోస్టింగ్ విషయంలో..ఆ జిల్లా మంత్రికి..ఆ మహిళా ఐఏఎస్ అధికారులకు మధ్య ఏదో వ్యవహారం నడిచిందని ఒకటి రెండు న్యూస్ ఛానల్స్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయ్.
ఆ వార్తలను బేస్ చేసుకుని సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు..మహిళా అధికారుల పేర్లు పెట్టి ట్రోల్స్ చేశారు. దీంతో అధికార వర్గాల్లో తీవ్ర చర్చే జరిగింది. దీంతో ఆ మహిళా ఐఏఎస్‌లకు అండగా..ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్స్ రంగంలోకి దిగడం..హాట్ టాపిక్‌గా మారింది.
మహిళా ఐఏఎస్‌ల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ లేఖ విడదల చేశాయి ఐఏఎస్, ఐపీఎస్ అసోషియేషన్స్. నిరాధారమైన ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు. ఇష్టారీతిగా..కథనాలు అల్లడం..నిజానిజాలు తెలుసుకోకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. జన సైనికులకు పార్టీ కీలక ఆదేశాలు
కుటుంబ సమస్యలు, ఫోన్ కాల్స్ పేరుతో వచ్చిన వార్తలు అవాస్తమని..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సప్ చాటింగ్లకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది ఐఏఎస్, ఐపీఎస్‌ల అసోసియేషన్స్. అయితే ఐఏఎస్‌ల తరఫున వాళ్ల అసోసియేషన్సే కాదు..తనపై వచ్చిన వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు.
మహిళా ఐఏఎస్ ఆఫీసర్లపై వచ్చిన వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారులపై దుష్ప్రచారం చేయడం సరికాదన్న ఆయన..ఇంకా తనివి తీరకపోతే తనకు విషమిచ్చి చంపేయండి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మహిళా ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయని..వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరారు.
ఆ ఇద్దరు కలెక్టర్ల ట్రాన్స్‌ఫర్స్ తనకు ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి..అనవసరంగా తనను మానసిక హింసకు గురి చేయొద్దని వేడుకున్నారు. మహిళా అధికారుల వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తలతో వారు ఎంతటి మానసిక వేదనకు గురవుతారో ఆలోచించాలని కోరారు.
ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చేందుకు ఇన్ డిటేయిల్డ్ దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ కోరతానన్నారు మంత్రి కోమటిరెడ్డి. 20 రోజుల్లో అన్ని విషయాలు బయటికి వస్తాయంటూ ఫైనల్ టచ్ ఇచ్చారు. ఇక పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితంపై వార్తలు ప్రసారం చేయడం సరికాదని..ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని రిక్వెస్ట్ చేశారు.
అయితే మంత్రి, అధికారులపై అలాంటి వార్తల రావడానికి ఆధారం ఏంటి? అసలు విషయం ఎక్కడ స్టార్ట్ అయింది? నిజంగానే ఏదో వ్యవహారం నడిచిందా? లేక గాలి వార్తలతోనే ఇంత పెద్ద రాద్దాంతం జరిగిందా.? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్స్ రియాక్ట్ అవడమే కాదు..మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించడంతో..మరి ఏది నిజం..ఏది అవాస్తవం. ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఏకంగా తనకు జీవితం మీద ఇంట్రెస్ట్ పోయిందని..మీకు ఇంకా కసి తీరకపోతే తనకు విషం ఇచ్చి చంపేయండని కోమటిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఏ వార్తలు అయితే ఇన్నాళ్లు హల్చల్ చేశాయో..ఎవరి సెంట్రిక్‌గా అయితే వార్తలు వచ్చాయో..ఆ రెండు వర్గాలు స్పందించడంతో..కొత్త చర్చ మొదలైంది. అయితే పనిలో పనిగా వ్యక్తిగత విషయాలను రోడ్డుమీదకు తేవడం, అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుకోవడం కాంగ్రెస్ నేతల పనే అంటూ బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది.
కేటీఆర్‌పై ఇలాంటి తప్పుడు కామెంట్స్ చేసినప్పుడు కాంగ్రెస్ నేతలకు సోయి ఎక్కడ పోయిందంటూ అటాక్ మొదలు పెడుతున్నారు. ఏదేమైనా అసలు వాస్తవాలేంటో..అంతకముందు జరిగిన ప్రచారంలో నిజమెంతో తేలెదెప్పుడు.? ఈ చర్చకు..గాలి వార్తలకు ఎండ్‌కార్డ్ పడేదెప్పుడో వేచి చూడాలి మరి.