Tony
Kingpin Tony : డ్రగ్స్ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారో కూపీ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. టోనీని పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. చంచల్ గూడ జైల్లో ఉన్న టోనీని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తున్నారు. అతడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డ్రగ్స్ మెయిన్ మోస్ట్ వాంటెడ్ స్టార్ బాయ్ ఎక్కడ ? నగరంలో ఏ ఏ హోటల్స్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేశారు ? స్లీపర్ సెల్ తన కొరియర్ బాయ్స్ ను ఎలా హైదరాబాద్ కి విస్తరించాడు ?
Read More : Bengaluru Schools : కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూళ్లు రీఓపెన్.. ఎప్పటినుంచంటే?
కొరియర్ బాయ్ ద్వారా డ్రగ్స్ వ్యాపారులకు ఎలా చేరవేశాడు ? యూస్ చేసిన డ్రగ్స్ బిజినెస్ కోడ్ ఎంటి ? డ్రగ్స్ చేరవేతలో ఎలా కొరియర్ బాయ్స్ ను కాంటాక్ట్ అయ్యారు ? వ్యాపారులతో ఎలా పరిచయాలు పెంచుకున్నారు ? ఎలా డ్రగ్స్ డీలింగ్స్ చేశారు ? బిజినెస్ లో వందల కోట్ల రూపాయల వ్యాపారులతో పార్టీ ఎలా ఆరెంజ్ చేశాడు ? పరారీలో ఉన్న వ్యాపారులు ? డ్రగ్స్ గ్యాంగ్ లో ఇతరుల పాత్ర ఎంతుంది ? కేవలం 15 మంది వ్యాపారులేనా? ఇంకెంత మంది వ్యాపారులు ఉన్నారు ? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. వీటికి టోనీ ఎలాంటి సమాధానం చెబుతున్నాడో తెలియరాలేదు.
Read More : Soorarai Pottru : సూర్య సినిమా రీమేక్ చేస్తున్నా.. కన్ఫమ్ చేసిన అక్షయ్ కుమార్..
టోనీ కస్టడీతో మరిన్ని అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న నలుగురు వ్యాపారుల కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసుతో ప్రమేయం ఉన్న 30 మంది ప్రముఖుల చిట్టా పోలీసుల వద్ద ఉంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఏడుగురు బిజినెస్‌మెన్‌లు ఉన్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. టోనీతో బిజినెస్‌మెన్స్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీతో వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నారు. పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మురో 15 మంది వ్యాపారులను పోలీసులు గుర్తించారు.