Police Department Corona : పోలీస్‌ శాఖలో కరోనా కలకలం..

పోలీస్‌ శాఖను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయాలంటేనే పోలీసులు వణికిపోతున్నారు.

Corona cases in police department : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పోలీస్‌ శాఖను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయాలంటేనే పోలీసులు వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరికి కరోనా సోకగా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లతో కరోనా మరింత విజృంభిస్తుందని భయపడిపోతున్నారు.

ఇప్పటికే పలువురు పోలీస్‌ సిబ్బంది కరోనాతో మృతి చెందారు. దీంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లపై ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకోవాలని.. వెంటనే వాటిని నిలిపివేయాలని అభ్యర్థిస్తున్నారు.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉంది. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ చికిత్సకు కేటాయించింది. గాంధీ ఆస్పత్రిలో ఓపీ నిలిపివేయాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

గాంధీ ఆస్పత్రిలో మొత్తం 18 వందల 60 బెడ్స్ ఉన్నాయి. ఇప్పటికే 500 మందికిపైగా కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 150 మంది హాస్పిటల్‌లో చేరారు. అలాగే 450 వెంటిలేటర్ బెడ్స్ భర్తీ అయ్యాయి.

కేసులు పెరుగుతున్నందున నాన్ కోవిడ్ విభాగాన్ని కూడా కరోనా చికిత్స కోసం వినియోగంలోకి తెచ్చామని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు