కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కానీ క్లినిక్‌లు, వ్యాధి నిర్ధారణ, డయాగ్నస్టిక్ కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్ అయ్యాయి. అనారోగ్య సమస్యలున్న వారికి క్లీనిక్ సెంటర్లు లేకపోడంతో ఇంబ్బందులు పడుతున్నారు.
సాధారణంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే సమీపంలోని క్లినిక్‌లు చికిత్స అందించేవి. ప్రమాదాల బారినపడితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు తక్షణ సేవలందించేవి. కానీ ప్రస్తుతం వీటిని మూసివేయడంతో సాధారణ ఆరోగ్య సేవలకు ఇబ్బంది కలుగుతోంది. రోగానికి తగిన మందు వేసుకోకుంటే ఇతర అనారోగ్య సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.
అంతేకాదు పేదలందరికి ధైర్యంగా నిలిచే గాంధీ హాస్పిటల్ కూడా కరోనా ఆస్పత్రిగా మార్చారు. దీంతో అక్కడ రోజువారీ ఓపీ సేవలకు అవకాశం లేదని తెలిపారు. గాంధీ మాత్రమే కాదు ఉస్మానియా హాస్పిటల్, జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురౌతోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు సరైన వైద్య సేవలందక ఇబ్బందులు పడుతున్నారు.
Also Read | లాక్‌డౌన్ పొడిగింపు ఉండదు.. ఆరోజు నుంచే రైళ్లు అందుబాటులోకి!