coronaVirus : అత్యవసరం ఉంటే..100కు డయల్ చేయండి KCR సూచన

  • Publish Date - March 24, 2020 / 03:50 PM IST

తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కచ్చితంగా పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు కొన్ని అవసరాలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు.

ఒకరికి కడుపునొప్పి, బంధువులు ఎవరైనా చనిపోవచ్చు..హెల్త్ ఎమర్జెన్సీ, అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే..ప్రజలు 100 నంబర్ కు డయల్ చేయవచ్చన్నారు. వెంటనే అధికారులు అలర్ట్ అవుతారని, అవసరమైతే..వాహనాలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పారు సీఎం కేసీఆర్. 

2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య, పోలీసు, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.

లాక్ డౌన్ కచ్చితంగా పాటించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. అవసరమైతే..24 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తామని, కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేయడం అవసరమైతే..ఆర్మీని రంగంలోకి దింపుతామని తెలిపారు. వాహనాలు రోడ్ల మీదకు వస్తే..మాత్రం పెట్రోల్ పంపులు మూసివేస్తామన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా..వ్యాపారులు వ్యవహరిస్తే..మాత్రం తాము కఠినంగా..చూస్తామని వారి లైసెన్స్ లు జారీ చేయడమే కాకుండా..పీడీ యాక్టు ప్రయోగిస్తామని, జీవితాలు నాశనం చేసుకోవద్దని సీఎం కేసీఆర్ సూచించారు. 

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న టోల్ గేట్ల వద్ద వివిధ రకాల వస్తువులు తీసుకుని పలు వాహనాలు వచ్చి ఉన్నాయని..మొత్తం 3 వేలకు పైగా ఇవి ఉన్నాయన్నారు. వీరికి సౌకర్యంగా ఉండేందుకు ఒక్క రోజు మాత్రమే టోల్ గేట్లను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రికి వీరికి అనుమతినిస్తున్నట్లు, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.