ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వేలాది మంది మృతి చెందుతున్నారు. భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భూతం 27 మందిని బలి తీసుకుంది. వేయికి పైగా పాజిటివి కేసులు రికార్డయ్యాయి. ఏపీలో 21కి చేరగా…తెలంగాణా రాష్ట్రంలో 58 మంది చికిత్స పొందుతున్నారు.
ఇందులో కీలక అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రార్థనల కోసం ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారెవరు ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అధికార యంత్రంగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారిని గుర్తించేందుకు అటు తెలంగాణ, ఇటు ఏపీ టాస్క్ ఫోర్స్ బృందాలు ఆరా తీస్తున్నాయి.
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారు ఎక్కడ తిరిగారు ? ఎవరెవరిని కలిశారు ? అనే దానిపై దృష్టి సారించారు. ఎక్కువగా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.
* ఢిల్లీ వెళ్లిన వారి రిజర్వేషన్ వివరాలను సేకరిస్తున్నారు అధికారులు.
* 280 మంది వెళ్లినట్లు గుర్తించారు. దాదాపు 200 మంది ఒంగోలు రైల్వే స్టేషన్ లో దిగినట్లు, వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
* ఢిల్లీ వచ్చిన వారి వివరాలు సేకరించగా..500 మంది దాక ఉన్నట్లు తెలుస్తోంది.
* ప్రకాశం జిల్లాలో 280 మంది, నెల్లూరు జిల్లాలో 70, మిగిలిన జిల్లాలో 12-46 మంది ఉన్నారు.
* చీరాల పరిసర ప్రాంతాల్లో పాటు కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, ఒంగోలు నగరంలో సుమారు 105 మందిని గుర్తించి..వీరిని క్వారంటైన్ కు తరలించినట్లు సమాచారం.
* కనిగిరిలో కజికిస్తాన్ నుంచి వచ్చి క్వారంటైన్ కు వెళ్లకుండా..వైద్య చికిత్సలు చేస్తున్న వైద్యుడిపై కేసు నమోదు చేశారు.
Also Read | ఫేషియల్ రికగ్నైజేషన్‌తో కరోనాకు అడ్డుకట్ట…రష్యా ఆధునిక టెక్నాలజీ