Kamareddy
Corona positive for 11 people : కామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపింది. శబరిమలకు వెళ్లి వచ్చిన పలువురికి కరోనా సోకింది. గాంధారి మండలం కేంద్రంలో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం 40 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి వచ్చారు. వీరిలో పరీక్షలు చేయించుకున్న 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. శబరిమలకు వెళ్లి వచ్చిన మిగిలిన వారు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో మరోసారి కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటితో (1,825) పోలిస్తే 100 కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 83, 153 కరోనా టెస్టులు చేయగా 1,920 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో ఇద్దరు మరణించారు.
BJP Muralidhara Rao : సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయం : మురళీధరరావు
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,045కి చేరింది. మరోవైపు వైరస్ నుంచి 417 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,496 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,97,775 కేసుల నమోదయ్యాయి.
తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగించింది.