Corona
Corona Cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా పాటిజివ్ కేసులు నమోదవుతున్నాయి. మహబూబాబాద్ లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
విద్యార్థులు జలబు, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు గురువారం(ఏప్రిల్6)న 51 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో 15 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
COVID-19: మళ్లీ భయపెడుతున్న కరోనా మహమ్మారి.. దేశంలో భారీగా పెరుగుతున్న కొత్త కేసులు ..
వైరస్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య పనులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.