Trs Mla
తెలంగాణలో మరో ప్రజాప్రతినిధికి కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీత అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..చికిత్స కొనసాగుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులాగా వ్యాపిస్తోంది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఆమెనే ప్రకటించారు. రెండు రోజుల క్రితం జలుబుతో బాధపడుతున్న సునీత దంపతులు స్వచ్ఛందంగా వారే హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి టెస్టులకు శాంపిల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారితోపాటు వారి కింద పని చేస్తున్న సిబ్బందికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే శుక్రవారం హైదరాబాద్ నుంచి వెలువడిన ఫలితాలు వచ్చిన సమాచారం ప్రకారం గొంగిడి సునీతతోపాటు ఆమె కింద పని చేస్తున్నవంటి సహాయకులకు ఇద్దరు కలుపుకుని మొత్తం ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. మొత్తం తొమ్మిది సహాయకులకు కూడా శాంపిల్స్ సేకరిస్తే అందులో ఇద్దరికీ పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త డీసీసీబీ జిల్లా చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డికి ఇంకా ఫలితం రావాల్సివుందని ఆమె ప్రకటించారు.
అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు. ఇప్పటికే ప్రారంభ దశలో ఉంది. చికిత్స అందిస్తున్నారు. అలాగే తాను ఆరోగ్యంగా ఉన్నాను. పూర్తి స్థాయి లక్షణాలు లేవు కాబట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పి ఆమె ప్రకటించారు.
అయితే ఇటీవలి కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. కొంత కాలంగా స్తబ్థదంగా ఉన్నా జిల్లాలో మళ్లీ కేసుల సంఖ్య ఇప్పటివకే వంద దాటింది. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతోపాటు ఇతర యంత్రాంగానికి కూడా కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా శానిటైజర్ కు సంబంధించిన అంశాలు, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో చాలా చోట్ల వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. సమయాన్ని తమంటకు తాము కుదదించుకుని మధ్యాహ్నానికే షాపులు బంద్ చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు.