Bagga.wine పేరిట మోసం : మొన్న రూ. 51 వేలు..నేడు రూ. 92 వేలు

  • Publish Date - April 14, 2020 / 09:52 AM IST

ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంటే..మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క మందు కావాలంటూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరి పరిస్థితిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. డబుల్, త్రిబుల్ ఛార్జీలు వేస్తూ..అందినకాడికి దోచుకుంటున్నారు. మద్యం దొరక్క కొంతమంది పిచ్చెక్కిపోతున్నారు. రోజుకు రెండు..మూడు గంటలైనా తెరవాలని కోరుకుంటున్నారు.

ఇది ఇలా ఒకవైపు కొనసాగుతుంటే..మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ లో మద్యం విక్రయిస్తున్నామని, ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే బాటిళ్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మబలుకుతున్నారు. ఇది నమ్మి వేలకు వేలు పంపిస్తున్నారు. బగ్గా వైన్స్ పేరిట మరొక వ్యక్తిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇటీవలే ఈ వైన్స్ పేరిట మోసం జరిగిన సంగతి తెలిసిందే.(మే 3 వరకు రైళ్లు, విమానాలు బంద్)

ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో మద్యం బాటిళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆర్డర్ ఇస్తే..ఇంటి వద్దకే బాటిళ్లు పంపిస్తామని అరవింద్ అనే వ్యక్తిని నమ్మబలికారు. దీనిని నమ్మి రూ. 92 వేలు సమర్పించాడు. కానీ టైం గడచిపోతోంది. బాటిల్ మాత్రం రాలేదు. చివరకు తాను మోసపోయానని గ్రహించి…సైబర్ క్రైం సెల్ కు ఫిర్యాదు చేశాడు. ఇటీవలే ఓ వ్యక్తి రూ. 51 వేలు పంపించి మోసపోయిన సంగతి తెలిసిందే.