CP Vishnu Warrier : మువ్వా విజయ్ బాబును హత్య చేస్తామంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవం : సీపీ విష్ణు వారియర్

ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

CP Vishnu Warrier

Muvwa Vijay Babu : మువ్వా విజయ్ బాబును హత్య చేస్తామంటూ పోస్టర్లు వెలిశాయంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పేర్కొన్నారు. మువ్వా విజయ్ బాబును హత్య చేస్తామంటూ.. పోస్టర్లు వెలిసినట్లు మీడియా, సామజిక మాద్యమాలలో వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సీపీ విష్ణు వారియర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

మువ్వా విజయ్ బాబుపై మీడియాలో వస్తున్న ఆరోపణలకు, వార్తలకు సంబంధించి ఏలాంటి ప్రాథమిక అధారాలు పోలీసుల విచారణలో లభించలేదని తెలిపారు. ఈ ఘటనపై ఎవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

Kazipet Wagon Production : కాజీపేటలో వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గతంలో ఎప్పుడూ మువ్వా విజయ్ బాబుకి ప్రాణహాని ఉందని అతను గాని, వారి తరపున గానీ ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు జిల్లాలో లేవన్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్న ముప్పు జాబితాలో కూడా మువ్వా విజయ్ బాబు పేరు లేదని వెల్లడించారు.

తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఊహాజనితమైన తప్పుడు కథనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పటిస్తూ, ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అలజడి సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలిస్ కమిషనర్ విష్ణు వారియర్ హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలేవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.