CPI Narayana sensational comments
CPI Narayana Sensational Comments : తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నేత నారాయణ స్పందించారు. గవర్నర్ లక్ష్మణ రేఖను దాటారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్బంగా నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవే పనికిమాలిన పదవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముసుగులో ఉన్న టీఎస్ గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ తప్పుల వల్లే తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని చెప్పారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి కేసీఆర్ బయటపడాలని సూచించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ కు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ భవన్ అంటరాని ప్రదేశమా? అని ప్రశ్నించారు. మీరు అద్భుతంగా పాలిస్తుంటే ప్రజలు నా దగ్గరకు ఎందుకు వస్తున్నారని టీఎస్ సర్కార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళనైనందుకే రాజ్ భవన్ ను గౌరవించడం లేదా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తే ఎందుకు హాజరు కారని ప్రశ్నించారు.