Dr. Jupally Rameswar Rao: డాక్టర్. జూపల్లి రామేశ్వరరావుకు క్రెడాయ్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.. ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు.. తెలంగాణ క్రెడాయ్.. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందజేసింది.

Dr Jupally

Dr. Jupally Rameswar Rao: మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు.. ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు.. తెలంగాణ క్రెడాయ్.. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందజేసింది. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. డాక్టర్ జూపల్లికి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

నిర్మాణ రంగంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న డాక్టర్ జూపల్లి.. తనకు ఈ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రగతిలో నిర్మాణ రంగానిదే కీలక పాత్రగా చెప్పారు. “ఏడేళ్లుగా హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. నగర ప్రగతిలో కన్‌స్ట్రక్షన్ రంగం కీలకంగా మారింది. ఈ రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని డాక్టర్ జూపల్లి చెప్పారు.

రాబోయే రోజుల్లో క్రెడాయ్ కీలక పాత్ర పోషించబోతోందన్న డాక్టర్ జూపల్లి.. రెరాపై ప్రభుత్వం, క్రెడాయ్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెరా అమలులో వచ్చే సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పారు. క్రమశిక్షణతో వచ్చే పెట్టుబడులనే ఆహ్వానించాలని.. అక్రమ నిర్మాణాల కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.. డాక్టర్ జూపల్లి.

Read More:

TS First IPS Salima : తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డు