TS First IPS Salima : తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డు

తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ గా షేక్ సలీమా రికార్డు సృష్టించారు.

TS First IPS Salima : తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డు

Ts First Ips Salima

TS First IPS Salima : ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఐఏఎస్, ఐసీఎస్ లుగానే కాకుండా భారతదేశ రక్షణలోని త్రివిధ దళాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారు. ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నతస్థాయిలో మహిళలు విధులు నిర్వహిస్తున్నారు.దీంట్లో బాగంగానే సంప్రదాయాల ముసుగులోనుంచి బయటకు పెద్దగా రాని ముస్లిం మహిళలు కూడా ఉండటం సంతోషించాల్సిన విషయం. అలా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఓ ముస్లిం మహిళ ఐపీఎస్ అధికారిగా నియమితులై చరిత్ర ఖమ్మం జిల్లాకు చెందిన షేక్‌ సలీమా రాష్ట్రంలోనే తొలి ముస్లిం మహిళా ఐపీఎస్‌గా రికార్డులకెక్కారు.

Read more : Women Commandos for VIP: వీఐపీల రక్షణ కోసం మహిళా కమాండోలు..

కేంద్ర ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 21,2021) విడుదల చేసిన నాన్‌ కేడర్‌ ఐపీఎస్‌ల ప్రమోషన్ల లిస్టులో షేక్ సలీమా స్థానం దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన సలీమా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు.

సలీమా తండ్రి లాల్ బహదూర్ ఖమ్మం జిల్లాలో SIగా పనిచేసి రిటైర్ అయ్యారు. సలీమా 2007లో గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో తొలి పోస్టింగ్‌ పొందిన సలీమా అంబర్‌పేట పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌గాను, మాదాపూర్‌లో అదనపు కమిషనర్‌(అడ్మిన్‌)గా పనిచేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సలీమా కుటుంబంలో అందరు చదువుకున్నవారే. దీంతో స్వతహాగానే సలీమాకు చదువు అంటే ఇష్టం..తండ్రి పోలీస్ కావటంతో ఉన్నతస్థాయి పోలీసు కావాలనే లక్ష్యంతో సలీమా చదువు సాగింది.

Read more : Indian Army : ఆర్మీలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ హోదా

సలీమాకు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు. సలీమా సోదరి జరీనా ఇటీవల ఏపీలో గ్రూప్‌–1 పరీక్ష రాసి మెయిన్స్‌కు సెలక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే సలీమా సోదరికూడా ప్రభుత్వ ఉద్యోగి అవుతారు. సలీమా మరో చెల్లెలు మున్నీ కూడా ఉద్యోగే. ఖైరతాబాద్‌ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిం హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌. సలీమా భర్త కూడా సాఫ్ట్‌వేర్‌ రంగం. ఇలా సలీమా కుటుంబం అంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే.