Women Commandos for VIP: వీఐపీల రక్షణ కోసం మహిళా కమాండోలు..

ప్రముఖుల రక్షణ కోసం మహిళా కమాండోలు సిద్ధమయ్యారు. జెడ్ ప్లస్ కేటగిరిలో రక్షణ పొందే వీఐపీలరక్షణ టీమ్ లో మహిళ కమాండోలు సత్తా చాటనున్నారు.

Women Commandos for VIP: వీఐపీల రక్షణ కోసం మహిళా కమాండోలు..

Women Commandos For Vip

women commandos in VIP security teams : మహిళలు బయటకు వెళ్లాలంటే వారి రక్షణ కోసం ఇంట్లో ఎవరోకరిని తోడు తీసుకెళ్లాలనేది ఒకనాటి మాట. కానీ ఇప్పుడలా కాదు..ఉద్యోగాలు..వ్యాపారాలే కాదు ఏకంగా దేశ రక్షణాలో మహిళలుసత్తా చాటుతున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రముఖుల రక్షణ కల్పించే జెడ్ ప్లస్ కేటగిరిలో మహిళా కమాండోలు సేవలందించనున్నారు. దేశంలో అత్యంత ప్రముఖులైన వారి రక్షణ కోసం మహిళా కమాండోలు రంగంలోకి దిగనున్నారు. అత్యంత కఠిన శిక్షణ తీసుకుని అన్ని విధాలా సిద్ధమయ్యారు. సీఆర్పీఎఫ్ 32 మంది మహిళా సిబ్బందిని సిద్ధం చేసింది. వీఐపీల రక్షణ కోసం మహిళ కమోండోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది సీఆర్పీఎఫ్.

Read more : Indian Army : ఆర్మీలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ హోదా

అవసరమైతే రెప్పపాటు కాలంలో ఆయుధాలను వినియోగం..ఆయుధాల్లేకపోయినా వట్టిచేతులతో పోరాడడం వంటి అత్యంత కీలక అంశాలల్లో మహిళా కమోండోలు ఆరితేరారు.వీఐపీ రక్షణకు కావాల్సిన అన్ని అంశాలను అవపోసన పట్టారు ఈ మహిళా మణులు. ఆయుధాలు సహా రక్షణకు అవసరమైన అన్ని సాధనాలు వీరి వద్ద ఉంటాయి.

జనవరి నుంచి ప్రముఖుల రక్షణ బృందంలోకి ఈ మహిళా కమాండోలు చేరనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు మరో డజను వరకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రముఖులకు మహిళా కమోండోలు రక్షణ కల్పించనున్నారు. వీరి నివాసాల వద్ద, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ వీరి వెంటే ఈ కమాండోలు రక్షణగా నిలవనున్నారు.

Read more : Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!