Hyderabad : బీ కేర్‌ఫుల్.. లోన్ పేరుతో ఘరానా మోసం, రూ.60లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్

Hyderabad : లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు.

Cyber Fraud

Hyderabad – Cyber Fraud : టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలో, అదే స్థాయిలో మోసాలు పెరిగాయని బాధపడాలో తెలియని పరిస్థితి. అధునాతన టెక్నాలజీతో అన్ని పనులు సులభంగా మారాయి. అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. చాలా టైమ్ సేవ్ అవుతోంది. ఇది సంతోషించదగిన విషయమే. కానీ, అదే టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. సాంకేతికతను తమకు అనుకూలంగా చేసుకుని నేరాలకు, మోసాలకు పాల్పడుతున్నారు. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. క్షణాల వ్యవధిలో లక్షలు, కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

అదే సమయంలో ఎదుటి వ్యక్తి అవసరాన్ని, బలహీనతను, అత్యాశని కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు. తాజాగా హైదరాబాద్ లో ఘరానా మోసం బయటపడింది. లోన్ పేరుతో ఓ సైబర్ చీటర్ ఏకంగా రూ.60లక్షలు కొట్టేయడం తీవ్ర కలకలం రేపింది.

Also Read..Shameerpet Gun Firing : శామీర్‌పేట్ కాల్పుల కేసులో కొత్త కోణం.. వెలుగులోకి మనోజ్, స్మిత మోసాలు.. అందమైన అమ్మాయిలే టార్గెట్

లోన్ ఇప్పిస్తానంటూ రూ.60లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్తాన్ కి చెందిన శైకుల్ ఖాన్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్ నిర్వహిస్తూ లోన్స్ ఇప్పిస్తామని అమాయకులను టార్గెట్ చేస్తున్న ముఠాకు శైకుల్ ఖాన్ నాయకుడు. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తిని లోన్ ఇప్పిస్తామని నమ్మించాడు. వివిధ ఛార్జీల పేరుతో రూ.60లక్షలు కాజేశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసుని చేధించారు. సైబర్ నేరగాళ్ల ముఠాలోని మిగతా ఇద్దరు నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్లను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు.

సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చైతన్య పరుస్తున్నార. లోన్లు, ఆఫర్లకు కక్కుర్తి పడొద్దని హెచ్చరిస్తున్నారు. మన అత్యాశే క్రిమినల్స్ కు వరంగా మారుతోందని చెబుతున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫైనల్ గా.. మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష అని తేల్చి చెబుతున్నారు.

Also Read..CP CV Anand : కేబీఆర్ పార్క్ చుట్టూ 264 సీసీ కెమెరాలు.. 15 నిమిషాల్లో నేరం చేసిన వ్యక్తిని గుర్తిస్తున్నాం : సీపీ సీవీ ఆనంద్