Government Employees DA Hike
Government Employees DA Hike : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ సంక్రాంతి పండుగ వేళ భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సాయంత్రం జీవో విడుదల చేసింది.
Also Read : CM Revanth Reddy : గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వివాహానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ డీఏ పెంచింది. 30.03 శాతం నుంచి 33.67శాతానికి డీఏను సవరణ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెరిగిన డీఏ 2024 జులై 1 నుంచి వర్తించనుంది. జనవరి నెల వేతనంతో పెరిగిన డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్శిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కూడా డీఏ వర్తించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించడంపై ఉద్యోగుల హర్షం చేస్తున్నారు. టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీ దగ్గరకు రావడానికి ముందే డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చాను.. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా వెలువడుతుందని తెలిపారు. సీఎం ప్రకటన చేసిన కొన్ని గంటలకే సోమవారం సాయంత్రంకు డీఏకు సంబంధించిన జీవో అధికారికంగా విడుదలైంది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.227కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
జులై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న డీఏ బకాయిలు అన్నీ ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో వేయనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు 30విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్ టైం అసిస్టెంట్లు, వీఆర్ఏలకు నెలకు రూ.100 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది.
మరోవైపు ప్రతి ఉద్యోగికి కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, పదవీ విరమణ పొందే వారికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.