Daggubati Rana
Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని కొడుకు రాణా పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడంటూ బాధిత ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో బాధితుడు పిటీషన్ వేసిన విషయం విధితమే. మంగళవారం నటుడు రాణా విచారణకు హాజరుకావాల్సి ఉన్పప్పటికీ గైర్వాజరయ్యారు. దీంతో నటుడు రాణా విచారణ వచ్చేనెలకు సిటీ సివిల్ కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. సురేష్ బాబు తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రాణా పేరుపై రీజిస్ట్రేషన్ చేశాడంటూ బాధితుడి ఆరోపించారు. మరొకరికి సైతం అగ్రిమెంట్ చేసి మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రాణాకు రీజిస్ట్రేషన్ చేశాడని బాధితుడు ఆరోపించారు.
Rana : స్థలం వివాదంపై కోర్టుకు హాజరైన దగ్గుబాటి రానా.. విచారణ వాయిదా..
హీరో వెంకటేష్ సైతం తన పేరు మీద1200 గజాల భూమి నాకు లీజ్ అగ్రిమెంట్ చేశాడని, బలవంతంగా నన్ను ఖాళీ చేయించేందుకు దగ్గుపాటి కుటుంబం ప్రయత్నిస్తోందని పిటీషనర్ పేర్కొన్నారు. సొసైటి నామ్స్ కు విరుద్ధంగా సురేష్ బాబు ఎక్కువ ప్లాట్లు కలిగి ఉన్నాడని, సురేష్ బాబు తనకు ఉన్న పరపతిని ఉపయోగించి పలు రకాలుగా వేధిస్తున్నాడని, పులువరు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో గతంలో బెదిరింపులకు దిగాడని బాధితుడు తెలిపాడు. మా కుటుంబంకు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోందని, నాకు ఏం జరిగిన సురేష్ బాబుదే బాధ్యత అంటూ బాధితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Rana Daggubati : కేసు విషయంలో కోర్టుకు హాజరైన హీరో దగ్గుబాటి రానా
అయితే నేను కొనుగోలు చేసిన భూమిని దక్కించుకొనేందుకే దగ్గుపాటి ఫ్యామిలీ పై న్యాయ పోరాటాన్ని సాగిస్తానని బాధితుడు అన్నాడు. ఇదిలాఉంటే.. భూ వివాదం కేసులో సిటీ సివిల్ కోర్టుకు మంగళవారం దగ్గుపాటి రాణా హాజరు కావాల్సి ఉంది. రాణా కోర్టుకు హాజరుకాక పోవటంతో సిటీ సివిల్ కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.