Danam Nagender
Danam Nagender: తెలంగాణ పాలిటిక్స్‌లో పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ కీలకంగా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేస్తున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. పదిమంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పిటిషన్ కొట్టేశారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎటువంటి తీర్పు ప్రకటించలేదు. అయితే ఆ ఐదుగురిలో ఒకరైన దానం నాగేందర్ ఇంత వరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఒకపక్క కేసు విచారణ సీరియస్‌గా జరుగుతున్న టైమ్‌లోతాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం విషయంలో ఫిరాయింపు వివాదం కీలకంగా మారింది. మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేల కథ వేరు. దానం మ్యాటర్ మరింత స్పెషల్‌గా మారింది. దానం పార్టీ మారారని అనడానికి కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేయడమే కీలక ఆధారం.
Also Read: కొత్త సంవత్సరంలో జనంలోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్.. గులాబీ బాస్‌ను అడ్డుకునేలా రేవంత్ స్కెచ్?
ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తాను పార్టీ మారారని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉండడంతో ఏదో ఒక రోజు చర్యలు తప్పవని దానం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పార్టీ పెద్దల దగ్గర దానం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని చెబుతూనే పార్టీ పెద్దల దగ్గర దానం ఒక కండీషన్ పెట్టారట.
కచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కోరారా?
కాంగ్రెస్‌లో చేరేటప్పుడే దానం తన మనసులోని మాటను పార్టీ పెద్దల ముందు ఉంచారట. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా ఇదే కండీషన్‌తోనే పోటీ చేశారట. లోక్‌సభ ఎన్నికల్లో ఓడితే..కచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కోరారట. లేటెస్ట్‌గా ఫిరాయింపుల ఎపిసోడ్ సీరియస్‌గా మారడంతో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని పార్టీ పెద్దలకు చెప్పారట.
దానం ఈ విషయం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట. ఇక ఆలస్యం చేస్తే తనకి ఇబ్బంది తప్పదని గ్రహించిన దానం.. తనకి తాను మీడియా ముందుకు వచ్చి ఓపెన్ అయ్యారట. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని దానం కావాలనే స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేసిన ఆధారం ఉండటంతో దానంపై స్పీకర్ చర్యలు తీసుకుని..మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు దానం నాగేందర్ తనకు తాను కాంగ్రెస్‌లో ఉన్నానని ప్రకటించడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక తప్పదనే ఇండికేషన్ మాత్రం ఇచ్చారు దానం. మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.