Ranga Reddy : ప్రియుడితో కలిసిన తల్లిన చంపిన యువతి
మహిళల్లో నేరప్రవృత్తి పెరుగుతుంది.. తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు
- kunduru Vinod
- Updated on- October 18, 2021 / 08:34 PM IST
Guntur Murder
Ranga Reddy : మహిళల్లో నేరప్రవృత్తి పెరుగుతుంది.. తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. భర్తతో గొడవపడి వేడి నీటిని మర్మాంగాలపై పోసిందో మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది మరో మహిళ. ఇక తాజాగా ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హత్యచేసింది ఓ యువతి.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ చింతల్మెట్‌కి చెందిన నందిని, చోటూ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు తల్లి యాదమ్మ అడ్డుగా ఉందని నందిని చంపేసింది. స్థానికుల ద్వారా విషయం తీసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూతురు నందిని ఆమె ప్రియుడు చోటూను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
