Extrta Marital Affair Murder : యువకుడ్ని హత్యచేసి… శవం పోలీసు స్టేషన్‌లో అప్పగించి లొంగిపోయిన నిందితులు

సోదరితో  వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే  కోపంతో ఒక వ్యక్తిని హత్యచేసిన సోదరుడు శవాన్ని పోలీసు స్టేషన్ లో అప్పగించి స్నేహితులతో కలిసి లొంగిపోయారు.

Extrta Marital Affair Murder : యువకుడ్ని హత్యచేసి… శవం పోలీసు స్టేషన్‌లో అప్పగించి లొంగిపోయిన నిందితులు

Bangalore Young Man Murder

Extrta Marital Affair Murder : సోదరితో  వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే  కోపంతో ఒక వ్యక్తిని హత్యచేసిన సోదరుడు శవాన్ని పోలీసు స్టేషన్ లో అప్పగించి స్నేహితులతో కలిసి లొంగిపోయారు.

బెంగుళూరులోని గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేసే భాస్కర్ అనే వ్యక్తికి.. అదే  ఫ్యాక్టరీలో    పనిచేసే కవిత అనే వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. క్రమేపి సన్నిహితంగా ఉంటున్న  వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఇది తెలిసి ఆమెకు, భర్తకు  మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని 15 రోజుల   క్రితం పుట్టిటికి వెళ్లింది.

అక్కడ ఇదే విషయమై   శనివారం ఆమెకు, తల్లికి మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో ఆమె భాస్కర్‌కు   ఫోన్ చేసి   ఈవిషయం చెప్పింది. వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్ళిన భాస్కర్   ఆమెతో పాటు ఇద్దరు పిల్లల్ని తీసుకుని తన  వెంట ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈక్రమంలో ఆమె పెద్ద కుమారుడు భాస్కర్ తో వెళ్లేందుకు నిరాకరించాడు.  భాస్కర్ తన తల్లిని తీసుకు వెళుతున్న విషయాన్ని అతని మేనమామ ఆటో డ్రైవరైన మునిరాజ్ కు ఫోన్ చేసి చెప్పాడు.

Also Read : Petrol Price: పెట్రోల్ కంటే విమాన ఇంధనం ధరలే తక్కువ!

దీంతో మునిరాజ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి తన సోదరితో  కలిసి వెళుతున్న భాస్కర్ ఆటోను అడ్డగించాడు. సోదరి, చిన్న కూమారుడిని ఆటోలో ఇంటికి వెనక్కి పంపించాడు. భాస్కర్ ను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని  సుంకడకట్టే సమీపంలోని కెబ్బేహెల్లాలోని   నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భాస్కర్ ను విచక్షణా రహితంగా కొట్టారు.  అనంతరం భోజనానినికి వెళ్లివచ్చారు.

అనంతరం భాస్కర్ ను తీసుకుని నగరంలోకి వచ్చారు. వచ్చే దారిలో మళ్లీ తీవ్రంగా  కొట్టారు. దీంతో భాస్కర్ స్పృహ తప్పి పడిపోయాడు. భాస్కర్ అపస్మారక స్ధితిలోకి వెళ్లి నాటకం ఆడుతున్నాడని అనుమానించారు.  కొద్ది  సేపటికి భాస్కర్ శరీరం గట్టి పడంటం, చల్లపడటం జరిగింది.  తీరా పరిశీలించి చూడగా భాస్కర్ మరణించాడని తెలుసుకున్నారు.  ఈవిషయం మునిరాజ్ తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె సూచన మేరకు భాస్కర్ మృతదేహాన్ని  అన్నపూర్ణేశ్వరీ నగర్ పోలీసు స్టేషన్ లో అప్పగించి స్నేహితులతో కలిసి లొంగిపోయాడు.  దీంతో మునిరాజ్ అతని ముగ్గురు స్నేహితులు మారుతి, నగేష్, ప్రశాంత్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు,