ఏదో కుట్ర పన్నాడు.. అందుకే చంపేశాడు: పార్సెల్‌లో డెడ్ బాడీ కేసు.. మృతుడి భార్య ఈశ్వరీ కీలక కామెంట్స్‌

తాగుడుకు బానిసైన పర్లయ్య దొరికిన పని చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతాడని ఈశ్వరీ అన్నారు

పశ్చిమ గోదావరి జిల్లాలో సాగి తులసి అనే మహిళకు పార్సెల్‌లో డెడ్‌ బాడీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మృతదేహం కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు.

బర్రె పర్లయ్య భార్య ఈశ్వరి ఇవాళ 10 టీవీతో మాట్లాడుతూ.. అనుమానిత నిందితుడు శ్రీధర్ వర్మ ఏదో కుట్ర పన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబానికి దూరంగా ఉంటున్న తన భర్తను వర్మ తన కుట్రలో భాగంగా హత్య చేశాడని వ్యాఖ్యానించారు.

తాగుడుకు బానిసైన పర్లయ్య దొరికిన పని చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతాడని అన్నారు. తన భర్తను హత్య చేసిన వర్మను కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు.

కాగా, ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి పార్సెల్‌లో గుర్తుతెలియని మృతదేహం వచ్చిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు అనుమానిత నిందితుడు వర్మను అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో పలు విషయాలను పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మ ఇంట్లో మరో చెక్కపెట్టె, ప్యాకింగ్ కవర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అతడు ఎందుకు సేకరించి పెట్టుకున్నాడన్న విషయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ వర్మే పర్లయ్యను హత్య చేశాడని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

Sandhya Theatre Incident : తొక్కిసలాట కాదట.. రేవతి చనిపోవడానికి అసలు కారణం ఇదేనా..