Severed Head Case: మెట్టు మహంకాళి తల, మొండం కేసు.. చిక్కని నిందితుల ఆచూకీ!

మెట్టు మహంకాళి తల, మొండం కేసులో నల్లగొండ ,రాచకొండ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

Mettu

Nalgonda Severed Head Case: సంచలనం సృష్టించిన మెట్టు మహంకాళి తల, మొండం కేసులో నల్లగొండ ,రాచకొండ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నా కూడా నిందితులను పట్టుకోలేకపోయారు. నల్లగొండ, రాచకొండ పోలీసులు సంయుక్తంగాఈ కేసును దర్యాప్తును చేస్తున్నా.. టెక్నాలజీ పెరిగినా కూడా ఈ కేసులో నిందితుల ఆచూకీ దొరకలేదు.

వనస్థలిపురం పీఎస్ పరిధి తుర్కయంజాలో జైహింద్ నాయక్ హత్య జరగ్గా.. నిందితుల కోసం స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. గుప్తనిధులు, క్షుద్రపూజల హత్యగానే దీనిని అనుమానిస్తున్నారు పోలీసులు. ఒంటిపై దుస్తువులు లేకుండా హత్యచేయటంతో నరబలి కోణం ఉందని భావిస్తున్నారు.

సీసీ పుటేజ్, ఫౌన్ సీడీఆర్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేయగా.. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. తల, దొరికిన నాలుగు రోజులకు మొండెం గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు నిందితులను పట్టుకోక పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.