Telangana : తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, ఒక్కరోజే 49 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.

Telangana Covid 19

Decreased Corona Cases : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ సోకి..49 మంది ప్రాణాలు వదిలారు. 6 వేల 206 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒకే రోజు 58 వేల 742 మంది శాంపిల్స్ సేకరించారు. ఇందులో 5 వేల 695 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,352, మేడ్చల్‌ జిల్లాలో 427, రంగారెడ్డిలో 483 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 56. భద్రాద్రి కొత్తగూడెం 108. జీహెచ్ఎంసీ 1352. జగిత్యాల 190. జనగామ 37. జయశంకర్ భూపాలపల్లి 39. జోగులాంబ గద్వాల 58. కామారెడ్డి 40. కరీంనగర్ 231. ఖమ్మం 121. కొమరం భీం ఆసిఫాబాద్ 41. మహబూబ్ నగర్ 221. మహబూబాబాద్ 119. మంచిర్యాల 165. మెదక్ 59. మేడ్చల్ మల్కాజ్ గిరి 427. మలుగు 21. నాగర్ కర్నూలు 132.

నల్గొండ 52. నారాయణపేట్ 28. నిర్మల్ 34. నిజామాబాద్ 258. పెద్దపల్లి 99. రాజన్న సిరిసిల్ల 79. రంగారెడ్డి 483. సంగారెడ్డి . 249. సిద్ధిపేట 238. సూర్యాపేట 42. వికారాబాద్ 109. వనపర్తి 101. వరంగల్ రూరల్ 67. వరంగల్ అర్బన్ 393. యాదాద్రి భువనగిరి 46.

Read More : India Vaccine Shortage : వచ్చే మూడు నెలల్లో భారత్ వ్యాక్సిన్ తీవ్ర కొరత తప్పదు!