Secunderabad Cantonment Skyways
Defence Department Green Signal : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో స్కైవేస్, ఫ్లైవోవర్ల నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో స్కైవేస్, ఫ్లైవోవర్ల నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించింది. 33 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో స్కైవేస్ నిర్మాణానికి సుగమం అయింది. కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయంపై కంటోన్మెంట్ వికాస్ సంబరాలు చేసుకుంది. కర్ఖానా – తిరుమలగిరి రోడ్డు విస్తరణకు అవకాశం ఏర్పడిందని స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.