Kavitha Arrest : ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో కవిత.. ఈడీ అధికారుల విచారణ

కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

MLC Kavitha

Delhi Excise Policy Case : ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఎదుట కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. ఆరోజు మధ్యాహ్నం తిరిగి కవితను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ లో కవితను అధికారులు ఉంచారు. ఆదివారం నుంచి సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు.

Also Read : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను వదలని ఈడీ.. విచారణకు రావాలంటూ మరోసారి సమన్లు జారీ

ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజూ సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును కవితకు న్యాయస్థానం కల్పించింది. కవిత కలుసుకునే వారిలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యుల్లో హరీష్ రావు, ప్రణీత్ లతో పాటు న్యాయవాదుల బృందం పేర్లు న్యాయస్థానానికి కవిత తరపు న్యాయవాదులు అందజేశారు. దీంతో కవితను కలిసేందుకు హైదరాబాద్ నుంచి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లారు.

Also Read : ఎన్నికల వేళ గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తున్న కవిత అరెస్టు పరిణామం

మరోవైపు.. సోమవారం విచారణకు రావాలని కవితకు సంబంధించిన పలువురిని పిలిచినట్లు ఈడీ అధికారులు శనివారం కోర్టుకు తెలిపారు. అదేవిధంగా.. కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఒకటి కవిత, మరొకటి కవిత భర్త ఫోన్లుగా ఈడీ పేర్కొంది. మిగిలిన ఫోన్లు వాడుతున్న వారిలో కవిత వ్యక్తిగత సహాయకులు ఉన్నట్లు సమాచారం. వారందరినీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ పిలిచినట్లు సమాచారం.

 

 

 

ట్రెండింగ్ వార్తలు