ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు.. విచారణ ఏప్రిల్ 4కు వాయిదా

MLC Kavitha: కవిత సమాజంలో గుర్తింపు ఉన్న మహిళ అని, ఆమెను అరెస్ట్ చేయాల్సిన..

MLC Kavitha (1)

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ఏప్రిల్ 4కు వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు కవిత తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రంలోపు రిజాయిన్డర్ దాఖలు చేస్తామని కవిత తరఫు న్యాయవాదులు తెలిపారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది. ఈ మేరకు కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది.

కవితకు బెయిల్ మంజూరు చేయాలని సింఘ్వి అన్నారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి కవిత అరెస్ట్ వరకు జరిగిన పరిణామాలపై కోర్టులో వాదనలు వినిపించారు. కవిత సమాజంలో గుర్తింపు ఉన్న మహిళ అని, ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ లోనూ ఆమె పేరు లేదన్నారు.

అరుణ్ పిళ్ళై కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్ మెంట్ ను కూడా ఉపసంహరించుకున్నాడని చెప్పారు. తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 18 నెలల తరువాత కవితను అరెస్ట్ చేశారని అన్నారు. కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలంలో విజయ్ నాయర్ తో జరిగిన సమావేశాల తేదీల గురించి తెలియదని చెప్పాడని అన్నారు. అయితే, బుచ్చిబాబు కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాడని అరెస్ట్ చేశారని, బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. తిహార్ జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం, పుస్తకాలు, ధ్యానం చేసుకునేందుకు జపమాల, షూను కోర్టు అనుమతించింది.

Also Red: లోక్‌సభ ఎన్నికల్లో వీరు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేయండి: కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు