Hyderabad : ముషీరాబాద్ గాంధీన‌గ‌ర్‌లో ఇళ్ల కూల్చివేత‌.. ఉద్రిక్తత

ముషీరాబాద్‌లోని గాంధీన‌గ‌ర్ వివేకానంద న‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది.

Demolition of houses in Musheerabad

ముషీరాబాద్‌లోని గాంధీన‌గ‌ర్ వివేకానంద న‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల‌ కూల్చివేత‌లను చేప‌ట్టారు. బ‌స్తీలోనికి ఎవ్వ‌రిని అనుమ‌తించ‌కుండా భారీ బందోబ‌స్తు మ‌ధ్య అధికారులు కూల్చివేత‌ల‌ను ప్రారంభించారు. అక్ర‌మంగా ఇళ్ల నిర్మాణాలు చేయ‌డంతో కూల్చివేస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

23 కుటుంబాలు గ‌త 70 సంవ‌త్స‌రాలుగా అక్క‌డ నివాసం ఉంటున్న‌ట్లు స్థానికులు చెబుతున్నారు. స్థ‌లం వివాదం కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంద‌న్నారు. వ‌చ్చే నెల 6వ తేదీన కేసు విచార‌ణ‌కు రానుంద‌ని, అయిన‌ప్ప‌టికీ అధికారులు ఇళ్ల‌ను కూల్చివేస్తున్నార‌ని బ‌స్తీ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా.. రోడ్డు, ప్రభుత్వ భూమిలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను అధికారులు తొల‌గిస్తున్నారు. కోర్టులో ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు రావ‌డంతో చ‌ర్య‌లు చేప‌ట్టారు. 2000 సంవత్సరం నుండి వివిధ రూపాల్లో కూల్చివేత‌ల‌ను స్థానికుల‌ను అడ్డుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులను న్యాయ‌స్థానం ఆదేశించింది. అయితే.. కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ కొంద‌రు వ్య‌క్తులు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేశారు. దీంతో అధికారులు నోటీసులు ఇచ్చి ఇళ్ల‌ను కూల్చివేస్తున్నారు.

Telangana BRS MLAs : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!

ట్రెండింగ్ వార్తలు