Dengue:హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో డెంగ్యూ ప్రభావం.. కారణం కుండలే!

జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి మరియు సికింద్రాబాద్ నివాసితులు డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Musquito

Dengue breeds: జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి మరియు సికింద్రాబాద్ నివాసితులు డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో హైదరాబాద్ మొత్తంలో డెంగ్యూ కారకాలు ఈ ప్రాంతాలు 30 శాతానికి పైగా కనిపిస్తున్నాయి. డెంగ్యూ వ్యాప్తికి ఇండోర్ ప్లాంట్లను ఉంచడానికి ఉపయోగించే కుండలు కారణమని అధికారులు గుర్తించారు. “దోమల లార్వా వృద్ధి చెందుతున్న పూల కుండల క్రింద నీరు పేరుకుపోతుందని, పూల కుండీల కింద సాసర్‌లను ఉంచే అలవాటు ఉన్న నివాసాలలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది” అని అధికారులు చెబుతున్నారు.

జూబ్లీ హిల్స్ మరియు కొండాపూర్, ఇతర సంపన్న ప్రాంతాలలో ఎక్కువగా డెంగ్యూ కేసులు వస్తుండగా.. డెంగ్యూ అనేది దోమల వల్ల స్పష్టమైన నీటిలో పుడుతుందని వారు చెబుతున్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి రాకముందే రాజధానిలో డెంగ్యూ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

వర్షాకాలంలో డెంగీ, మలేరియా జ్వరాలు సాధారణమే. జ్వరం వచ్చిన వెంటనే చాలామంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడంతో నెగెటివ్‌ రాగానే, మామూలు జ్వరమే అని అశ్రద్ధ వహిస్తున్నారు. అలా తేలిగ్గా తీసుకోకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ విషయంలో జాప్యం చేస్తే రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

గత 45 రోజుల్లో తెలంగాణలో 1,666 డెంగ్యూ కేసులు నమోదవగా.., హైదరాబాద్‌లో మాత్రమే 537 కేసులు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో, నగరం నుండి 1,725 ​​సహా మొత్తం 4,771 నమూనాలను పరీక్ష కోసం సేకరించారు. దోమలే డెంగ్యూకు కారకాలు కాగా.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో పూల కుండీలు, కూలర్లు, నీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేసుకుని ఆర బెట్టుకోవాలని సూచిస్తున్నారు.

డెంగ్యూ లక్షణాల విషయానికి వస్తే, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్లు కదపలేని పరిస్థితి, శరీరంపై ఎర్రటి పొక్కులు. శరీరంలో 1.5 లక్షల నుంచి 4లక్షల వరకు ప్లేట్స్‌లెట్స్‌ ఉంటాయి. 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం అని అంటున్నారు అధికారులు. మలేరియా లక్షణాలు విషయానికి వస్తే, చలిజ్వరం, తలనొప్పి, వాంతులతోపాటు తీవ్ర నీరసం వస్తుంది.