ఇది కరెక్ట్ కాదు..!- బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనపై డీజీపీ కీలక ప్రకటన..

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే.. ఇలా రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయడం..

Telangana Battalion Constables Protest (Photo Credit : Google)

Telangana Battalion Constables Protest : తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల పోలీసులకంటే.. మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతభత్యాలు ఉన్నాయని అన్నారు. పోలీసుల సంక్షేమం, భద్రత, ఆరోగ్య భద్రత వంటివి అమలు చేస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. పోలీస్ ఇమేజ్ ను కాపాడటం మన బాధ్యత అన్న ఆయన.. ఇలా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. సీనియర్ పోలీస్ అధికారులుగా సమస్యలు పరిష్కరిస్తామన్న డీజీపీ.. ఏమైనా సమస్యలు ఉంటే దర్బార్ లో చెప్పుకోవచ్చన్నారు.

బెటాలియన్ కానిస్టేబుల్స్ తీరుని ఇప్పటికే డీజీపీ.. తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో పోలీస్ శాఖలో సాలరీస్ ఉన్నాయని చెప్పారు. పోలీస్ వెల్ఫేర్ విషయంలో భద్రత, ఆరోగ్యం.. తెలంగాణ పోలీస్ శాఖనే ముందుందన్నారు. ఇలా అన్ని విషయాల్లోనూ తెలంగాణ పోలీస్ శాఖ ముందుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే.. ఇలా రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయడం బాధాకరం అన్నారు.

బెటాలియన్ కానిస్టేబుల్స్ చెబుతున్న సమస్యలన్నింటిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఇప్పటికే డీజీపీ చెప్పారు. అయినప్పటికి ఇంకా కావాలనే, ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కై రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సంజయ్ కుమార్ జైన్ ఒక సర్కులర్ ను జారీ చేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు గత ప్రభుత్వంలో ఏవైతే సెలవు దినాలు ఉన్నాయో, ఇప్పుడు కూడా అవే అమలు అవుతాయన్నారు. పాత పద్ధతినే అవలంభిస్తామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితిలో అవలంభించము అన్నారు.

అయినా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ.. ఈ ప్రాంతాల్లో ఉన్న బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి, పోలీస్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం సరికాదన్నారు డీజీపీ జితేందర్. మీ సమస్యలను తప్పకుండా ఉన్నతాధికారులు పరిష్కరిస్తారని డీజీపీ జితేందర్ ప్రకటించారు.

Also Read : ఫస్ట్‌ అరెస్ట్ ఆయనదేనా..? దివాలీలోపు తెలంగాణలో ఏం జరగబోతోంది?