Medaram Mahajatr
DGP Mahender Reddy : మేడారం మహాజాతర సమీపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై 2022, జనవరి 29వ తేదీ శనివారం డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గద్దెల దగ్గర పూజారులతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాలని, మేడారం మహా జాతర కోసం 10 వేల మంది వివిధ హోదాల్లోని పోలీస్ సిబ్బంది సేవలు అందించడం జరుగుతుందన్నారు.
Read More : Lamb Care : చలికాలంలో గొర్రెపిల్లల సంరక్షణ…మెళకువలు
జాతరకు వచ్చే ప్రతి వెహికల్ ను సక్సెస్ గా లోపలకి పంపితే ట్రాఫిక్ క్లియర్ అయినట్టే.. ఇబ్బంది ఉండదని, రోడ్డు మీద వాహనాలు నిలవకుండా చూసుకోవాలన్నారు. వీఐపీ, వీవీఐపీలు, ప్రోటోకాల్ లో ఉన్న వారి వాహనాలతో సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ.. క్లియర్ చేస్తూ జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. జాతర విధుల్లో ఉండే పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే, డ్యూటీ సక్సెస్ గా చేయడం జరుగుతుందని..అప్పుడు జాతర విజయవంతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.
Read More : Kidney Function : కిడ్నీల పనితీరు మెరుగుపర్చుకునేందుకు…
ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు.